ఏపీలో మిషన్ వాత్సల్య పథకం.. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే

29746చూసినవారు
ఏపీలో మిషన్ వాత్సల్య పథకం.. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఇవే
ఏపీ ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకం అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అర్హులైన అనాథలు, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దరఖాస్తు కోసం పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలు సమర్పించాలి. ఈ పత్రాలన్నింటినీ గెజిటెడ్ అధికారి ధృవీకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.72 వేలు, పట్టణాల్లో రూ.96 వేలు మించకూడదు. 2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. స్థానిక అంగన్‌వాడీ లేదా ICDS అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్