మేడారం జాతరలో అంబులెన్స్‌ల దుర్వినియోగం.. వైద్య సిబ్బందిపై ఆరోపణలు

5246చూసినవారు
TG: ములుగు జిల్లా మేడారం జాతరలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంబులెన్స్‌లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్ పాస్‌తో, సైరన్ వేసుకుంటూ అత్యవసర సేవలుగా చెప్పుకుంటూ, డాక్టర్ల కుటుంబాలను, బంధువులను నేరుగా మేడారం మహాద్వారం వరకు తరలిస్తూ రవాణా వ్యాపారం చేస్తున్నారని ములుగు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై భక్తులు ఆరోపిస్తున్నారు. ఇది జాతర పేరుతో జరుగుతున్న అక్రమ దందా అని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్