కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మంచు విష్ణు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. తన సోదరుడు మనోజ్ కు పరీక్షలు చేయించలేని విష్ణు, తమపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యేగా తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని రిపోర్టులు చూపిస్తానని, విష్ణు కూడా అదే చేయాలని అనిరుధ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో రాసిస్తే, అన్ని చేయించుకుని రిపోర్టులు సమర్పిస్తామని, అయితే విష్ణు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.