AP: మార్కాపురం
టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆందోళన చేపట్టారు. తమ 40 ఎకరాల భూమిని కబ్జా చేశారని, రౌడీలను పంపించి కత్తులు, కర్రలతో దాడులు చేయించారని ఆరోపించారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తోందని, ఎప్పుడు చంపుతారోనని ప్రాణభయంతో బతుకుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ బాధ చెప్పుకున్నామని, ఎస్పీ, ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.