ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం (VIDEO)

19చూసినవారు
AP: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం ఎదురైంది. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు. పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆమెను అడ్డుకుని నిలదీశారు. తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే రాగా.. కొందరు లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించారు. దీనిపై మత్స్యకారులు ఎమ్మెల్యేను నిలదీశారు. పరిహారం జాబితా గందరగోళంగా ఉండటంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక వెళ్లిపోయినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్