వైసీపీ ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన MLA ఎమ్మెస్ రాజు

22చూసినవారు
వైసీపీ ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన MLA ఎమ్మెస్ రాజు
AP: తాను భగవద్గీతని అవమానపరిచినట్లు వస్తున్న వార్తలపై మడకశిర MLA ఎమ్మెస్ రాజు స్పందించారు. హిందూ సోదరుడిగా ఈ విషయంలో క్షమాపణ కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియా విడుదల చేశారు. తాను భగవద్గీతని అవమానపరిచినట్లు వైసీపీ, అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని, ఆ వార్తల్లో  నిజం లేదని స్పష్టం చేశారు. తాను హిందువునని, రాజ్యాంగం వల్లే దళితుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఆయన తెలిపారు. హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్