AP: అనకాపల్లి(D) అచ్చుతాపురం(M) దుప్పితూరు భూ వివాదంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించారట. అలాగే ఎమ్మెల్యే విజయ్‌కుమార్ నుంచి వివరణ తీసుకున్నట్లు తెలిసింది.