వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఎమ్మెల్యే తాటిపర్తి సవాల్

6127చూసినవారు
వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఎమ్మెల్యే తాటిపర్తి సవాల్
సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. 16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు చేసింది శూన్యమని, వైఎస్సార్, వైఎస్ జగన్ ప్రభుత్వాలే ప్రాజెక్టుకు ప్రాణం పోశాయని ఆయన అన్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తున్నారని, నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 2024లో వైఎస్ జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, చంద్రబాబు హయాంలో కేవలం 4.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్