AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను మోసం చేశారని, పైగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తల్లితో ఫిర్యాదు చేయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. వీణపై నమోదైన కేసు చెల్లదని పేర్కొంది. ఈ మేరకు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.