రోగుల కోసం మారువేషంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే

4367చూసినవారు
AP: సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శనివారం మారువేషంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి, ఆయన రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కూడా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను గుర్తుపట్టని ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆశ్చర్యపోయారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్