ఏపీ రాజకీయాల్లో
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గల్లంతు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో విచారణకు కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పిన దువ్వాడ, గమ్యస్థానానికి చేరకపోవడంతో అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. దివ్వెల మాధురి ఆయనను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు ఖండించారు. దువ్వాడను తాము అరెస్ట్ చేయలేదని, విచారణకు ఆయన హాజరుకాలేదని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ మిస్సింగ్‌పై రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.