శ్రీకాకుళం: మరోసారి పోలీస్ విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరుకానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు కొత్తూరు పీఎస్‌కు చేరుకోనున్నారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.