MLC సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు అప్పగింత

AP: బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా ఆయనను అధిష్ఠానం నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన సోము వీర్రాజు, ఇకపై మండలిలో బీజేపీ కార్యకలాపాలను సమన్వయం చేయనున్నారు. ఇప్పటివరకు బీజేపీకి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఈ కీలక పదవిని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.