'ఆదరణ 3.0' పథకం కింద ఆధునిక కుట్టు మిషన్లు

42చూసినవారు
'ఆదరణ 3.0' పథకం కింద ఆధునిక కుట్టు మిషన్లు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదరణ 3.O పథకాన్ని అమలుకు సిద్ధమైంది. ఆదరణ 3.0 పథకం కింద టైలర్లకు ఆధునిక కుట్టు మిషన్లు అందిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టైలర్ల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ ఆకాశపు స్వామి మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రూ.1,000 కోట్లతో త్వరలో అమలు కానున్న ఈ పథకం ద్వారా అన్ని సామాజికవర్గాల టైలర్లకు మేలు జరుగుతుందని మంత్రి వివరించారు.
Job Suitcase

Jobs near you