ఢిల్లీలోని సేవాతీర్థంలో భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని
మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తు కార్యచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలను సరళీకరించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించాలని, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి స్వయంసమృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వ విభాగాలు ఒకే వ్యవస్థగా పనిచేయాలని, శాఖల మధ్య అడ్డంకులను తొలగించాలని, పీఎం గతిశక్తి వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రధాని
మోదీ అధికారులకు పిలుపునిచ్చారు.