సింధూ జలాల్లో చుక్క నీరు కూడా మోదీ వదలట్లేదు: పాక్‌ అక్కసు

550చూసినవారు
సింధూ జలాల్లో చుక్క నీరు కూడా మోదీ వదలట్లేదు: పాక్‌ అక్కసు
భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని పక్కనబెట్టడంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ఇటీవల యుద్ధానికైనా సిద్ధమేనని హెచ్చరించిన పాక్, తాజాగా మరోసారి భారత్‌పై ప్రేలాపనలు చేసింది. పాకిస్థాన్ మంత్రి ముసాదిక్‌ మాలిక్ మాట్లాడుతూ, సింధూ జలాల్లో తమ వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భారత్ తమ నీటి హక్కులకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. పాక్ మరో మంత్రి అట్టావుల్లా తరార్, నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలకమని, సింధూ జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్