మోదీ దేశాన్నే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు: పవన్‌

16677చూసినవారు
మోదీ దేశాన్నే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు: పవన్‌
ప్రధాని మోదీ కర్మ యోగి అని, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను నడుపుతున్నారని తెలిపారు. కర్నూలు శివారులో నిర్వహించిన ‘సూపర్‌ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్‌’ బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ తీసుకొచ్చారని తెలిపారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అంటూ కొనియాడారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్