పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, చమురు సంక్షోభానికి చెక్ పెట్టేలా పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడాలని నోయిడాలో ప్రసగింస్తూ సూచించారు. ఇథనాల్ వాడకం పెరిగితే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, సెమీకండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు ప్రారంభోత్సవాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి నిదర్శనమని తెలిపారు.