ప్రధాని నరేంద్ర
మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్‌లలో రూ.1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్, సవరించిన UDAN స్కీమ్ ప్రారంభిస్తారు. పచ్‌పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో ఫేజ్-2, రైల్వే ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్లు, రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు.