వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని
మోదీ,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సదస్సులో ఇరాన్ సంక్షోభం, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిలో మైన్లను తొలగించే ప్రణాళికలపై ట్రంప్ తన మిత్రదేశాలతో చర్చించనున్నట్లు
అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇరాన్‌తో వివాదానికి ముగింపు పలికేలా గొప్ప పరిష్కారం కుదిరిందని, ఆ దేశం దీనిపై సంతకం చేస్తే సంక్షోభం పూర్తిగా ముగుస్తుందని ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ ఒప్పందం ఖరారైన వెంటనే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పునఃప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.