మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట

61చూసినవారు
మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
AP: మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట లభించింది. 2022-23 నుంచి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు వర్సిటీ రూ.26.17 కోట్లు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఆ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. వర్సిటీ అనుమతులు, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై వర్సిటీ కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ఆడ్మిన్ బాధ్యతల్ని ఎస్‌వీయూకి అప్పగించాలన్న ఉత్తర్వులనూ నిలిపివేసింది.
Job Suitcase

Jobs near you