ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ సిఫార్సులపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం అభ్యంతరం

2098చూసినవారు
ఏపీహెచ్ఈఆర్ఎమ్సీ సిఫార్సులపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) సిఫార్సులపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు విడుదల చేసిన ప్రకటనలో, ఈ సిఫార్సులు హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయని, కోర్టు స్టే ఉత్తర్వును ధిక్కరించి APHERMC వాటిని పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. MBU భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తోందని, రాయలసీమను ఉన్నత విద్యకు కేంద్రంగా మారుస్తోందని తెలిపారు.

ట్యాగ్స్ :