మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ 'తుదక్కం' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో మోహన్ లాల్ 'దృశ్యం' సినిమా ఛాయలు కనిపించాయి. ఒక చిన్న కుటుంబం హిల్ స్టేషన్‌కు వలస వెళ్లి, రాత్రిపూట ఆగంతకుల వల్ల ఇబ్బందులు పడటం, ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.