డబ్బుతో స్వేచ్ఛ కొనొచ్చా?.. బిట్స్ పిలానీ విద్యార్థి కథ వైరల్

9181చూసినవారు
డబ్బుతో స్వేచ్ఛ కొనొచ్చా?.. బిట్స్ పిలానీ విద్యార్థి కథ వైరల్
బాల్యంలో ఇంట్లో గొడవలు, భయాల మధ్య పెరిగిన ఓ వ్యక్తి చదువుతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. 10వ తరగతిలో 90%, ఇంటర్‌లో 97% మార్కులు సాధించి BITS పిలానీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. CATలో అనారోగ్యంతో IIM అవకాశం కోల్పోయినా, మరో బిజినెస్ స్కూల్‌లో చేరి కెరీర్‌లో రాణించాడు. ప్రస్తుతం ఏడాదికి రూ.2.2 కోట్ల ఆదాయం, రూ.14 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉన్నా, తనకు అసలు విజయం డబ్బు కాదని, పిల్లలకు భయంలేని బాల్యాన్ని అందించగలిగిన ప్రశాంతమైన కుటుంబమే నిజమైన సంపద అని రెడ్డిట్‌లో వెల్లడించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్