రెండు సంవత్సరాలకు పైగా లావాదేవీలు లేని లేదా పదేళ్ల వరకు క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తిరిగి ఖాతాదారులకు అందించేందుకు RBI ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ 'క్లెయిమ్ చేయని డిపాజిట్లను' RBI డిఇఎ (DEA) ఫండ్‌కు బదిలీ చేస్తుంది. ఖాతాదారులు లేదా వారి చట్టపరమైన వారసులు బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి, కేవైసీ పత్రాలను సమర్పించి, వడ్డీతో సహా నగదును తిరిగి పొందవచ్చు. క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆన్‌లైన్‌లో కనుగొనడానికి RBI ఉద్గమ్ (UDGAM) పోర్టల్ (https://udgam.rbi.org.in) ను అందుబాటులోకి తెచ్చింది.