ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వల్ల వాతావరణం తాజాగా మారుతుంది, ఇంటి అందం పెరుగుతుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. మొక్క ఆకులు వాడిపోతే నెగెటివ్ ఎనర్జీ పెరిగినట్లుగా పరిగణిస్తారు. మట్టిలో పాలు, చక్కెర కలపడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుందని నమ్మకం. కుండకు ఎర్ర దారం కట్టడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని, ఆదాయ ప్రవాహం నిలకడగా ఉంటుందని చెబుతారు. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది.