AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు విడతల వారీగా రూ.600 కోట్ల పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.318 కోట్లు ఇచ్చామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీరు ఇవ్వడానికన్నా ముందే నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.