AP: ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందని, దాని విలువ రూ.12,200 కోట్లు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకోసం 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16,700 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. గత ప్రభుత్వం వదిలిన రూ.1,570 కోట్ల బకాయిలలో 87%ను 48 గంటల్లో చెల్లించామని చెప్పారు. ఈసారి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.