AP: వెలిగొండ ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం రైతులతో సమావేశమైన ఆయన, మొత్తం రూ.10,580 కోట్ల వ్యయంలో ఇప్పటివరకు రూ.6,736 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. మిగిలిన పనుల కోసం చర్యలు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.759 కోట్లు వెచ్చించామని, తాజాగా మరో రూ.905 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పునరావాసం, పునరుద్ధరణ (R&R) కింద కేటాయించిన రూ.300 కోట్లను సోమవారం నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.