నవంబర్ నుంచి వారి అకౌంట్లలోకి డబ్బులు జమ: మంత్రి కొండపల్లి

46చూసినవారు
నవంబర్ నుంచి వారి అకౌంట్లలోకి డబ్బులు జమ: మంత్రి కొండపల్లి
AP: రాష్ట్రంలో 9.5 లక్షల మంది పింఛన్‌దారులకు డీబీటీ చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ నెల నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పింఛన్ డబ్బుల్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద గజపతినగరం మండలంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. నవంబర్ నుంచి అందరికి డబ్బులు అకౌంట్‌లలో జమ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్