హనుమంతుడి పూజలో వానరం.. వీడియో వైరల్

3958చూసినవారు
TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహెగాం రామాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ దీక్షా చేస్తున్న స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండగా ఓ వానరం ఆలయంలోకి ప్రవేశించింది. హారతి సమయంలో హనుమంతుడి విగ్రహం వద్దకు చేరుకుని భక్తితో మొక్కింది. స్వాములు ఇచ్చిన తీర్థాన్ని కూడా స్వీకరించింది. అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించింది. ఈ ఘటనను చూసిన భక్తులు సాక్షాత్తూ హనుమంతుడే వానర రూపంలో దర్శనమిచ్చారని భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వానరం వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్