రుతుపవనాలు మరింత ఆలస్యం

7చూసినవారు
రుతుపవనాలు మరింత ఆలస్యం
AP: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దాంతో జూన్ 4వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయనుకున్న రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, మంగళవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్