మొంథా ఎఫెక్ట్.. పెరిగిన కూరగాయల ధరలు

105చూసినవారు
మొంథా ఎఫెక్ట్.. పెరిగిన కూరగాయల ధరలు
AP: మొంథా తుఫాన్ దెబ్బకు కూరగాయల ధరలు కొండెక్కాయని సామాన్యులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల మార్కెట్‌లలో ధరలు అమాంతం పెరిగాయి. గత వారం కంటే ఈ వారం ధరలు భారీగా పెరిగాయని ప్రజలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు అమాంతం పెరిగాయని విజయవాడ కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :