మొంథా ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

20చూసినవారు
మొంథా ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
AP: మొంథా తుఫాను నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. మన్యం, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, విశాఖ, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలకు సెలవులిచ్చారు. ఈ నెల 31 వరకు కాకినాడలో సెలవులు ప్రకటించారు. మరోవైపు కృష్ణా, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కాలేజీలకు రేపు సెలవు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్