తీవ్ర తుఫానుగా బలపడిన ‘మొంథా’

66చూసినవారు
తీవ్ర తుఫానుగా బలపడిన ‘మొంథా’
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. గడచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర - వాయవ్య దిశగా ఇది కదులుతోంది. ఇది మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిమీ వేగంతో గాలులు వీయనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్