AP: రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గుడ్ న్యూస్ చెప్పారు. బస్సుల్లో రద్దీని తగ్గించేలా త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 1500 బస్సులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉచిత బస్సుల ద్వారా ప్రతిరోజు 21 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు. తొలి వారం కోటి మంది ప్రయాణించారని, దీని ద్వారా మహిళలకు రూ.41.22 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు.