గోదావరిలో దూకి తల్లి, బిడ్డ ఆత్మాహత్యాయత్నం

8740చూసినవారు
గోదావరిలో దూకి తల్లి, బిడ్డ ఆత్మాహత్యాయత్నం
TG: భద్రాచలం గోదావరి వంతెన పైనుంచి నదిలోకి దూకి ఓ మహిళ తన బిడ్డతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన సదరు మహిళ శనివారం తన బిడ్డతో కలిసి భద్రాచలం గోదావరి వంతెన వద్దకు చేరుకుని చిన్నారితో సహా నదిలోకి దూకింది. గమనించిన మత్స్యకారులు వారిని కాపాడారు. ​తల్లీబిడ్డను బయటకు తీసుకువచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్