సాగర్ కాలువలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య

18551చూసినవారు
సాగర్ కాలువలో దూకి తల్లీకూతురు ఆత్మహత్య
AP: పల్నాడు(D) మాచర్ల(M) తాళ్లపల్లిలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు గమనించి అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిద్దరూ స్థానికులు కాదని, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్