AP: పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో జయశ్రీ అనే మహిళ మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.