పాముకాటుతో తల్లీకొడుకుకి తీవ్ర అస్వస్థత

9911చూసినవారు
పాముకాటుతో తల్లీకొడుకుకి తీవ్ర అస్వస్థత
AP: పాము కాటుతో తల్లీకొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. జనుపువారిపల్లెకు చెందిన పార్వతమ్మ (65), ఆమె కుమారుడు ప్రభాకర్ (42) ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. రాత్రి వర్షం కురవడంతో ఉక్కపోత భరించలేక ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయారు. ఆ సమయంలో ఓ పాము ఇంట్లోకి ప్రవేశించి పార్వతమ్మ, ప్రభాకర్‌ను కాటు వేసింది. కుటుంబ సభ్యులు వారిద్దరినీ మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్