AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. బండారు లక్ష్మీలహరి, ఆమె కుమారుడు విజయ్ టెన్త్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆరో తరగతితో చదువు ఆపేసిన లక్ష్మీలహరి, తన కుమారుడు విజయ్‌తో కలిసి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్
పరీక్షలు రాశారు. విజయ్ 600కు 562 మార్కులు సాధించగా, లక్ష్మీలహరి 500కు 360 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి చదువును కొనసాగించి విజయం సాధించిన తల్లిని అందరూ అభినందిస్తున్నారు.