రెండో పెళ్లికోసం బిడ్డను చంపిన తల్లి

4722చూసినవారు
రెండో పెళ్లికోసం బిడ్డను చంపిన తల్లి
మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. రెండో పెళ్లికోసం ఓ తల్లి బిడ్డను హతమార్చింది. పుణెకు చెందిన 22 ఏళ్ల మహిళకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఓ బాబు(11 నెలలు) ఉన్నాడు. ఇటీవల కొడుకు అస్వస్థతకు గురి కాగా భర్త పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ మార్చి 8న కొడుకుని చంపి, మృతదేహాన్ని బావిలో పడేసింది. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయి మరో పెళ్లి చేసుకుంది. దీనిపై మొదటి భర్త రంజన్ గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్