రెండో పెళ్లి కోసం చిన్నారికి విషం పెట్టిన తల్లి!

8168చూసినవారు
రెండో పెళ్లి కోసం చిన్నారికి విషం పెట్టిన తల్లి!
తమిళనాడులోని సేలం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తూరు సమీపంలోని వరగూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళ తన 18 నెలల మగశిశువును తానే విషం పెట్టి చంపినట్లు ఒప్పుకుంది. మనస్పర్థల కారణంగా భర్త తిరుమలై వాసుదేవన్‌తో విడిపోయి ఉంటున్న లలిత, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించింది. అయితే, చిన్నారి తన పెళ్లికి అడ్డు వస్తాడని భావించి.. చిన్నారికి విషం కలిపిన ఆహారం తినిపించింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణలో లలిత నేరం అంగీకరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్