చైనాకు చెందిన మోటోరోలా సంస్థ, తన సిగ్నేచర్ సిరీస్‌లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం నాడు ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సాంకేతిక ఫీచర్లు, ఫాబ్రిక్-ఇన్‌స్పైర్డ్ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్, మూడు వేరియంట్లలో రూ.59,999 నుంచి రూ.69,999 వరకు ధరతో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.5వేల డిస్కౌంట్, రూ.5వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు.