ఎంపీ చిన్ని ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారు: కొలికపూడి

1చూసినవారు
ఎంపీ చిన్ని ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు అడిగారు: కొలికపూడి
AP: కూటమి నేతల్లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని తనను రూ.కోట్లు అడిగారని కొలికపూడి వ్యాఖ్యానించారు. అంతేకాక, తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా రూ. 66 లక్షల రూపాయలు పంపినట్లుగా ఒక పోస్ట్‌ను ఫేస్ బుక్‌లో పెట్టారు. "నిజమే గెలవాలి" అంటూ కొలికపూడి అందులో రాసుకొచ్చారు. ఈ ఆరోపణలు కూటమిలో దుమారం రేపుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్