కేశినేని నాని ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

23చూసినవారు
కేశినేని నాని ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
AP: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలపై ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. "విజయవాడలో రూ.120 కోట్ల కుంభకోణం జరిగింది. విజయవాడ చరిత్రలో ఇది అతిపెద్ద బ్యాంక్ స్కామ్. ఈ స్కామ్ చేసింది విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. 2016-17లో రూ.120 కోట్లు ఎన్పీఏ అయింది.. ఈ స్కామ్ వెనక చాలా మంది సూత్రధారులు ఉన్నారు. ఎన్పీఏ అయి 11 ఏళ్లు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కేశినేని నాని ఉండే ఇళ్లు, విందులు ఇస్తున్న హోటల్ కూడా బ్యాంక్ ఆధీనంలో ఉన్నాయి" అని ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్