పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఎంపీ రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించింది. దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా రాఘవ్ చద్దా 2023 నుంచి రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు. సామాన్యుల సమస్యలను సభలో ప్రస్తావిస్తూ ఆలోచింపజేస్తున్నారు.