వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌కు ఈమెయిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులపై విన్నవించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసులు చట్టాన్ని గాలికి వదిలేశారని, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేసి, ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని, పౌరుల ప్రాణాలను రక్షించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.