టీడీపీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని: ఎంపీపీ భర్త (వీడియో)

39చూసినవారు
AP: పల్నాడు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పిడుగురాళ్ల ఎంపీపీ గార్లపాటి అనసూర్య భర్త వెంకటేశ్వరరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ‘జూలకల్లులో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడిన వారందరిపైనా ఎమ్మెల్యే కక్ష గట్టి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు’ అని వీడియోలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్