AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ శ్రేణులపై
టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నికల వాతావరణాన్ని అశాంతికి గురిచేసేలా జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.